28-02-2025 10:23:32 AM
కొండపాక (విజయక్రాంతి): సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు... కొండపాక మండలంలోని మార్పడ్గ గ్రామానికి చెందిన గుడికందుల బిక్షపతి (40) గురువారం సాయంత్రం గ్రామంలోంచి సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. కిందపడిన అతన్ని స్థానికులు 108 సహాయంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బిక్షపతి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లి ఉన్నారు. ప్రభుత్వం భిక్షపతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.