24-09-2024 12:59:34 PM
శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): మియాపూర్ లో హిట్ అండ్ రన్ కేసు చోటు చేసుకుంది. మియాపూర్ నుండి కూకట్ పల్లి వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 622 దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టాడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికలు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించి, మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు ఢీకొట్టిన వాహనం వివరాల కోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.