మెదక్: జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఏడు పాయల మంజీరా ఆనకట్ట వద్ద నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. నిన్న రాత్రి కుటుంబసభ్యులతో అనిల్ అనే వ్యక్తి ఏడుపాయలకు వెళ్లాడు. తెల్లవారుజామున స్నానం చేసేందుకు అనిల్, ఆయన కుమారై కాలువలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రవాహానికి తండ్రి, కుమారై కొట్టుకుపోయారు. కొంత దూరంలో స్థానికులు చిన్నారిని కాపాడారు. నాగ్ సాన్ పల్లి వద్ద అనిల్ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో వారి కుటుంబం కన్నీరుమున్నీరై విలపిస్తోంది.