14-04-2025 12:03:46 AM
* పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు
* ఇన్స్పెక్టర్ పట్టించుకోలేదని ఆరోపణ
* ఉస్మానియా లో పరామర్శించిన ఎంబిటీ స్పోక్స్ పర్సన్ అంజద్ ఉల్లా ఖాన్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 13: ఓ వ్యక్తిపై కొందరు కత్తులతో దాడి చేశారు. గాయపడిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎం బి టి స్పోరట్స్ పర్సన్ అంజద్ ఉల్లా ఖాన్ పరామర్శించారు.
ఘటనకు సంబంధించి స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజా నగర్ కు చెందిన సయ్యద్ బాబాను కొందరు కారుతో ఢీ కొట్టారు. ఈ క్రమంలో వాగ్వాదం జరగడంతో బాధితుడిని కత్తులతో దాడి చేయడంతో తల, కడుపు భాగంతో పాటు శరీరంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు సయ్యద్ బాబాను ఎంబి టీ స్పోక్స్ పర్సన్ అంజద్ ఉల్లా ఖాన్ పరామర్శించారు. ఆసుపత్రి నుంచి అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు ఆయన ఫోన్ చేయగా స్పందించలేదని ఆరోపించారు. అనంతరం ఆయన రాజేంద్రనగర్ ఎసిపి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిందితులతో పాటు దాడి ఘటనను పట్టించుకోని ఇన్స్పెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను కోరారు.
- స్పందించని ఇన్స్పెక్టర్
ఓ వ్యక్తిపై కొందరు కత్తులతో దాడి చేసిన ఘటనపై అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు.