calender_icon.png 31 March, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా అమ్ముతున్న వ్యక్తి బైండ్ ఓవర్

28-03-2025 05:47:16 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో అక్రమంగా గుడుంబా అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పట్టణ ఏఎస్ఐ మజీద్ తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీసులకు అందిన  సమాచారం మేరకు, దొరల బంగ్లా ఏరియాకి చెందిన మానుపాటి సంపత్ అనే వ్యక్తి గుడుంబా అమ్ముతున్నట్లు సమాచారం రాగా, ఎఎస్ఐ మజీద్, తన సిబ్బందితో కలిసి దాడి చేసి 2 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మళ్ళీ ఎలాంటి నేరం చేయకుండా మండల తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగిందని వివరించారు.