calender_icon.png 6 February, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్లమా చేస్తేనే అనుమతులు

06-02-2025 05:36:16 PM

వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రావూరి శ్రీనివాసరావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): డిప్లమా తరగతులకు హాజరైన వారికే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రావూరి శ్రీనివాసరావు అన్నారు. గురువారం మేనేజ్ సమితి, ఆత్మ సౌజన్యంతో జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన డిప్లమా ఇన్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎరువుల, విత్తనాల, పురుగు మందు దుకాణ యజమానులు సంవత్సర కాలం పాటు ప్రతి ఆదివారం నిర్వహించే తరగతులకు హాజరై డిప్లమా సర్టిఫికెట్ పొందిన వారికి మాత్రమే లైసెన్స్ పొందే అవకాశం ఉంటుందన్నారు.

డీలర్లు అందరూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరు అయ్యి ఘర్షణ విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కోర్స్ ద్వారా రైతులకు సరియైన సూచనలు అందించి వారి అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏడిఏ జాడి మిలింద్ కుమార్, ప్రోగ్రాం అధికారి సావన్, వ్యవసాయ అధికారులు మంజుల, రామకృష్ణ, విజయ్, దీప్తి, ఏఈఓలు చిరంజీవి, వెంకటేష్, రాము, డీలర్లు పాల్గొన్నారు.