calender_icon.png 19 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ టైమ్ టెండర్లకు అనుమతులు

06-09-2024 02:10:00 AM

  • యుద్ధ ప్రాతిపదికన చెరువుల పునరుద్ధరణ 
  • నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెండర్లు
  • నష్టం అంచనాలకు అనుగుణంగా నిధులు 
  • ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  • జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): భారీ వర్షాలతో తెగిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని, అందుకు పాలనాపరమైన అనుమతులను వెంటనే పూర్తి చేయాలని  నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అనుమతులు పొందిన వెంటనే శుక్రవారం ఉదయా నికి నిబంధనలను పాటిస్తూ ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయాలని ఉత్తమ్ సూచించారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పరిణామాలపై గురువారం జలసౌధలోని నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇప్పటివరకు వరద నష్టంపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు. అంచనాలకు అనుగుణంగా నిధులు కేటాయిం పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.  క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. కొన్ని చోట్లరెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేయకపోవడాన్ని గమనించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక దగ్గర రెగ్యులేటరీ జామ్ అయిందని, మరో దగ్గర షట్టర్ ఎత్తుతుంటే తెగిపోయిందన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే సీఈలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తమ్ హెచ్చరించారు,

విపత్తు సమయంలో విధుల్లో నిమ గ్నమై, అప్రమత్తంగా పనిచేసిన నీటిపారుదల శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు. విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదన్నారు. ఇకముందు మరింత అప్రమ త్తతతో ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ప్రమాదపు సంకేతాలు గుర్తిస్తే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మరో రెండు, మూడు రోజులు తుపాన్ ఉంటుందని, వాటర్ స్టోరేజీ విషయంలో అన్ని జలాశయాల్లో అనుమతించిన మేరకు స్టోరేజీ ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

అన్ని షట్టర్లు, రెగ్యులేటర్లను క్షుణ్ణంగా గమనించాలన్నారు. సామర్థ్యం మేరకు జలయాశాల్లో నీటిని నింపాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేందర్‌రావు, నీటిపారుదల శాఖ సలహాదారు అదిత్యాదాసు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌తో పాటు చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.