calender_icon.png 24 February, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు ఒక పనికి.. అమ్ముకుంటుండ్రు మరొకరికి

24-02-2025 12:00:00 AM

  1. పేరుకే సీసీ రోడ్డుకు.. పక్కదారి పడుతున్న ఇసుక 
  2. ఎవరు ఎక్కువ ఇస్తామంటే వారికి సరఫరా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : కష్టపడు ప్రతిఫలం పొందు.. పొందిన ప్రతిఫలం నీ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది... ఉత్తగ వచ్చింది ఊరికినే పోతుంది.. అంటుంటారు పెద్దలు. పెద్దల మాట పెద్దలకే వదిలేసి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏమిటి దానిని అందిపుచ్చుకొని ముందుకు సాగితేనే ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తామని కొంతమంది అక్రమమే అయి నా ఆ మార్గాలను ఎంచుకుంటూ లాభాలే తమ ప్రధాన విధిగా పాటిస్తూ అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈనాటి ఆనాటిది కాదు ఏళ్ల తరబడి అక్రమ ఇసుక రవాణాకు కొంతమంది తమ వ్యాపారంగా ఎంచుకున్నారు. ఎన్ని నిబంధనలు వచ్చినా ? రాత్రి పగలు అనే భేదం లేకుండా కాస్త అనువైన పరిస్థితులు ఉంటే చాలు అక్రమ ఇసుకను సక్రమంగా అమ్ముకుంటూ లాభాలే ధ్యేయంగా అర్జిస్తుండ్రు.

ఈ క్రమంలోనే దేవరకద్ర మండలంలో ఒక పనికి ప్రభుత్వం ఇసుక సేకరించేందుకు అనుమతులు ఇచ్చిన వాటిని అదురుగా చేసుకుని ఇతరులకు ఇసుక అమ్ముకుంటున్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

నిర్మాణం అంటేనే ఇసుక తప్పనిసరి..

ఏ నిర్మాణం చేపట్టిన ఇసుక ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుంది. వాగులో లభించిన ఇసుకకు నిర్మాణాల్లో మరింత డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్న వారు నిరంతరం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.  దేవరకద్ర మండలంలో  గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సిసి రోడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

సీసీ రహదార్ల నిర్మాణానికి ఇసుక అవసరం కాగా ప్రభుత్వ అధికారులు వాగుల నుంచి ఇసుకను సీసీ రోడ్లకు వినియోగించేందుకుగాను అధికారులు దేవరకద్ర మండల పరిధిలోని గూర కొండ గ్రామ సమీపంలోని బండర్ పల్లి వాగు నుంచి వివిధ గ్రామాలకు సిసి రోడ్ల నిర్మాణ నిమిత్తం  ఇసుక తరలింపుకు అనుమతి ఇవ్వడం జరిగింది.

మండలంలోని బస్వాయిపల్లి గ్రామం లో 990 మీటర్ల సీసీ రోడ్డు, చెక్ డ్యామ్ నిర్మాణం చేసేందుకు రూ 35 లక్షల  నిధులు మంజూరు కావడంతో  పనులు ప్రారంభించారు.  గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఒక ట్రాక్టర్ కు రూ 600 చొప్పున ప్రభుత్వానికి డిడి చెల్లించారు.

దీంతో వాగు నుంచి ఇసుకను తరలించెందుగాను గూర కొండ గ్రామంలోని దాదాపు 40 ట్రాక్టర్ యజమానులు ముందుకు రావడంతో అధికారులు టోకెన్ల ద్వారా వాగు నుంచి బస్వాయిపల్లి గ్రామానికి ఇసుకను తరలించేందుకు అనుమతిం చారు. దఈ 40 ట్రాక్టర్ల యజమానులు డీడీలు ప్రభుత్వానికి చెల్లించారు. కాగా ట్రాక్టర్ యజమానులు మాత్రం 40 ట్రాక్టర్లు ఇసుకను బస్వాయిపల్లి గ్రామంకు తరలింపుకు చర్యలు తీసుకున్నారు.

ఇదే అదునుగా భావించిన ట్రాక్టర్ యజమానులు వాగుల నుంచి తీసుకొచ్చిన ఇసుకను సీసీ రోడ్ల నిర్మాణం జరిగే చోటుకు వెళ్లకుండా ఇతర ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. 

అధికారులపై ఆరోపణలు..

అధికారుల నుంచి ప్రభుత్వ పనులకు ఇసుక అనుమతి ఇవ్వడంతో ఇదే అదురుగా భావించిన కొందరు అక్రమంగా ఇసుకను అమ్ముకునేందుకు సిద్ధమయిండ్రు. ఈ క్రమంలో అంతర్లేనంగా అధికారులు సపోర్ట్ చేశారని ఆరోపణలు కూడా ఉపందుకున్నాయి.

నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు చేపట్టిన ఇదే అదునుగా చేసుకుని ఇతరులకు అంతర్లీనంగా విక్రయించేందుకు అధికారుల మద్దతు ఉందని మండల వాసులు చర్చించుకుంటున్నారు. కొంతమంది సమితి అధికారుల దృష్టికి తీసుకు వస్తేనే ఈ విషయం వెలుగులోకి రావడం అంటే అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

సమాచారం ఇవ్వడంతో ఆర్‌ఐ తనిఖీలు..

 వాగు నుంచి ట్రాక్టర్లు బస్వాయిపల్లి  గ్రామానికి వెళ్లకుండా ట్రాక్టర్ యజమానులు కొంతమంది ఇసుకను దేవరకద్ర మండల కేంద్రంలోని ఇతరులకు విక్రయిస్తున్నారని శనివారం మధ్యాహ్నం కొందరు  ఆర్‌ఐ శరత్ కు శనివారం సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం పరిశీలించగా రెండు ట్రాక్టర్లు ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా తీసుకువచ్చి తాసిల్దారు ముందు ఉంచారు.

ఇసుకను దేవరకద్ర మండల కేంద్రంలో ప్రవేట్ వ్యక్తులకు ఒక ట్రాక్టర్ ను  రూ 4000 నుంచి రూ 5000 వరకు ఇతరులకు ట్రాక్టర్ యజమానులు విక్రయిస్తున్నారు. అన్లోడ్ చేస్తుండగా పట్టుబడ్డాడు దీంతో ఆర్ ఐ శరత్ ట్రాక్టర్ ను తహసిల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి ఉంచారు. బసవ పల్లి గ్రామానికి రెండు రోజుల్లో 60 ట్రాక్టర్లు సరఫరా చేయవలసి ఉండగా 30 ట్రాక్టర్లు పక్కదారి పట్టింది.

ప్రస్తుతం శనివారం రోజు రెండు డాక్టర్లు మాత్రమే అధికారులు పట్టుకున్నారు మిగతా 28 ట్రాక్టర్లు ఇసుక ఎక్కడికెళ్ళినట్లు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తాసిల్దార్ కృష్ణయ్యను వివరణ కోరగా పట్టుబడిన రెండు ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్లకు 5000 రూపాయల జరిమానా విధించడం విధించడం జరుగుతుందని తాసిల్దార్ కృష్ణయ్య తెలియజేశారు.