calender_icon.png 22 February, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు ఓ రకం.. భవన నిర్మాణాలు మరో రకం

22-02-2025 01:22:29 AM

  1. మామూళ్లకు కక్కుర్తి పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
  2. ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా పట్టింపు లేదు
  3. మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి మురికి కాలువల పైన బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు
  4. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు
  5. కలెక్టర్ ప్రత్యేక అధికారిగానైన అక్రమ నిర్మాణాలపై కోరడ జుళిపించేనా? 
  6. ప్రజా ప్రతినిధుల అండ దండలతో బల్దియ ఆదాయానికి గండి

కామారెడ్డి, ఫిబ్రవరి 21( విజయ క్రాంతి): బావుల అంతస్తుల భవన నిర్మాణ దారులు బల్దియా ఆదాయానికి లక్షల్లో గండి కొడుతు న్నారు. అనుమతులు ఒక రకంగా తీసుకొని నిర్మాణాలు మరో రకంగా చేపడుతున్నారు. మున్సిపల్ కార్యాలయా నికి కూత వేట దూరంలో 200 మీటర్ల పరిధిలోని ఓ వ్యక్తి 5 అంతస్తుల  బాహుల అంతస్తు భవనాల ను నిర్మించాడు.

అతనికి కొందరు ప్రజాప్రతినిధుల అండ దండలు ఉండడంతో ఎవరు ఏమి చేయరనే ధీమాతో మునిసిపల్ తాళం పరిధిలోకి వచ్చి బహుల అంతస్తుల భవనాన్ని నిర్మిం చాడు. అనుమతులు మూడంతస్తుల తీసుకొని ఐదు అంతస్తుల భవనం నిర్మిం చాడు. అంతేకాకుండా మురికి కాల్వలను ఆక్రమించి రోడ్డును ఆక్రమించి భవనం ముందు స్థలాన్ని ఆక్రమించాడు.

నిత్యము రైల్వే స్టేషన్ కోటి రోడ్డుకు వెళ్లాల్సిన ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. అధికారులకు స్థానిక ప్రజలు శుక్ర వారం మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాల భాగోతం బయటపడింది. కేవలం కామారెడ్డిలో ఈ యొక్క భవనమే అనుకుంటే పొరపాటే.

బహుళ అంతస్తులు అపార్ట్మెంట్లు నిర్మాణాలలో అనుమతులు ఒక రకంగా తీసుకొని నిర్మాణాలు మరో రకంగా కడుతున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులకు ప్రజాప్రతినిధులు కొందరు మేనేజ్ చేసేస్తున్నారు. దీంతో మునిసిపల్ అధికారులు తమకేమీ పట్టన ట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో భవనానికి ఐదు లక్షల నుంచి పది లక్షలు గుడ్ విల్ తీసుకుంటు న్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి పట్టణం 32లో వార్డు వివేకానంద కాలనీకోర్టు పక్కన కొత్తగానిర్మిస్తున్న భవనం మున్సిపల్ రోడ్డును మున్సిపల్ మురికి కాల్వపైన గొల్ల మల్లేష్ అనే వ్యక్తి బహుళ అంతస్తు పవనాలు నిర్మించడంతోపాటు వ్యాపారానికి అనువుగా షట్టర్లను నిర్మించారు. పార్కింగ్ స్థలం లేకుండానే వ్యాపారాన్ని కోసం షట్టర్లు నిర్మించారు.

ఇదే కాలనీలో కిసాన్ షాపింగ్ మాల్ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇలాగే పట్టణంలో 20 భవనాలు బహుళ అంతస్తులు నిర్మించిన వారికి అనుమతులు ఒక రకంగా తీసుకుని నిర్మాణాలు మరో రకంగా చేపట్టారు. పేద ప్రజలు ఇల్లు కట్టుకునేం దుకు అనుమతి కోసం మున్సిపల్ అధికా రులు సవాలక్ష అంశాలు పెడుతూ అడ్డు కోవడం చూస్తుంటాం.

డబ్బు పలుకుబడి రాజకీయ అండదండలు ఉంటే నిబంధనలు తుంగలో తొక్కవచ్చని అనడానికి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల పరిధిలోని ఐదా న్తాస్తుల భవనం నిర్మించడమే ఇందుకు ఉదాహరణ గా చెప్పవచ్చు.  మున్సిపల్ అనుమతికి విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మా ణాలను కుల్చివేయాలని కాలనీకి చెందిన 20 మంది కుటుంబాల యజమానులు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి కి  లిఖితపూర్వకంగా శుక్రవారంఫిర్యాదు చేశారు.

మున్సిపల్ అనుమతి ఒక విధంగా ఉంటే నిర్మాణం మరో విధంగా ఉందని మున్సిపల్ అనుమతికి విరుద్ధంగా ఉన్న నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు.మురికి నీరు మురుగు కాల్వ ద్వారా వెళ్ళవలసి ఉండగా రోడ్డుపై నుండి ఉంటుందని ఆ మురికి నీరు మా ఇళ్లలోకి ప్రవేశిస్తుందని వారు ఆరోపించారు.

గొల్ల మల్లేష్ జి ప్లస్ త్రీ భవ నం కడుతూ దానికి  అదనంగా మరో రెండు అంతస్తులు  నిర్మిస్తున్నప్పటికీ మున్సి పాల్ కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారి పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు.

ఎత్తుగా నిర్మించడం వలన మురికి కాల్వ నుండి మురికి చెత్త తీయరాకుండా ఉందని అంతేకాకుండా రైల్వే రోడ్డు పక్కన కొత్తగా నిర్మాణం చేపడుతున్న గొల్ల మల్లేష్ రైల్వేగోడను ఆనుకొని సిమెంటు నిర్మాణాలు చేస్తున్నాడని దీనివలన డ్రైనేజీకి ఇబ్బంది కలిగిస్తూ ఉండడంతో మా ఇండ్లలోకి చెత్తనీరు వచ్చి చేరుతుందని తక్షణమే అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని లేనిచో కాలనీవాసులము ఏకమై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని వారు మాట్లాడుతూ చెప్పారు.

బిల్డింగ్ నిర్మాణ సమయంలో రెండు రోడ్లను ప్యాక్ చేసి ఇసుక కంకర సిమెంటు సలాకలు కంకర వేసి సామాన్య ప్రజలకు నడవలేని పరిస్థితిని కల్పించాడని వారన్నారు. ఈ విషయం గతంలో కూడా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ప్రిన్సిపాల్ కమిషనర్ చైర్ పర్సన్ పట్టణ ప్రణాళిక అధికారి దృష్టికి తీసుకువెళ్లిన అక్రమ నిర్మాణాన్ని మాత్రం ఆపలేకపోయారు.

గొల్ల మల్లేష్ కు ఉన్న రాజకీయ అండదండలు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడంతో కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారన్నారు. 2021 డిసెంబర్ నుండి ఇప్పటివరకు మురికి నీరు డ్రైనేజీ పై నుండి పారడం రోడ్డు వెంబడి నడిచే పాదాచారులకు ఇబ్బందులకు గురి కావడం నీరు గుంతలుగా ఉండడం వల్ల దోమలు పేరుకుపోయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి విష జ్వరాలతో ఈ రోడ్డు వెంబడి ఉన్న కుటుంబాలు అనారోగ్యాల పాలవుతున్నారని వారు ఆవేదన వెలుగుచ్చారు.

ఈ అక్రమ నిర్మాణం జరగడానికి స్థానిక మున్సిపల్ సంబంధిత అధికార యంత్రాంగమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయానికి 45 అడుగుల దూరంలో అక్రమ నిర్మాణం జరుగుతున్న అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడి చూసి చూడనట్లు ఉంటున్నారని ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు.

ఈ సందర్భంగా కాలని వాసుల అందరం ఏకమై సమావేశ ఓoఏర్పాటు చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా శుక్రవారం ఫిర్యాదు చేశామని చెప్పారు.

మున్సిపల్ అనుమతి లేకుండా జరిగిన నిర్మాణాలను సంబంధిత అధికారులు కొలతలు వేసి అనుమతికి విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయాలని లేనిచో మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కాలనీవాసులకు న్యాయం చేసేంతవరకు పోరాడుతారని కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వి.లక్ష్మీరాజ్యం చెప్పారు. అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు అడ్డుకోకుంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.