calender_icon.png 13 March, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా..

13-03-2025 01:07:11 AM

గాజులరామారం సర్కిల్‌లో జోరుగా అక్రమ నిర్మాణాలు..

టీఎస్ బిపాస్ చట్టానికి తూట్లు కొడుతున్న అధికారులు

కుత్బుల్లాపూర్, మార్చి 12 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకి అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నా యి. అధికారుల ఉదాసీనత వైఖరీతో అక్రమార్కులు విచ్చల విడితనం ప్రదర్శిస్తున్నారు. అనుమతులు ఒకలా పొంది.. నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణా లు అన్ని అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడంతో అక్రమాలపై పట్టణ ప్రణాళిక అధికారుల సహకారం తేటతెల్లమవు తుంది. అక్రమాలపై ఫిర్యాదులు అందిన, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యం. అడ్డదారిన అందిన కాడి కి అక్రమార్కుల వద్ద దండుకొని... చర్యలకు మాత్రం చట్టపరమైన నియమాలు, పద్ధతులు ఉంటాయంటూ చర్యలకు మీన మేషాలు లెక్కిస్తున్నారు.

గాజులరామరం పరిధిలోని మహాదేవపురంలో  ప్లాట్ నెం. P-10, మహాదేవపురం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఫేస్ -3లో స్టిల్ట్+2 రెసిడెన్షియల్ అనుమతులను పొంది ఏకంగా సెల్లార్ తో పాటు అదనంగా మరికొన్ని అంతస్థులను నిర్మిస్తున్నాడు. సదరు నిర్మాణానికి నోటీసులు ఇచ్చి చాల రోజులు గడుస్తున్న ఇంకా చర్యలు తీసుకోకపోవడం అధికారుల అలసత్త్వానికి నిలువెత్తు నిదర్షణం అని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు గాజులరామారం పరిధి సురారంలోని శ్రీరామ్ నగర్ ప్లాట్ నెం. 303(సౌత్ పార్ట్) లో సైతం నిర్మాణాధారుడు కేవలం స్టిల్ట్ +2 అనుమతులనే పొంది అదనంగా మరో రెండు అంతస్థులని నిర్మిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గాజులరామారం పరిధిలో ఇంకా చాలానే అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తాయి. 

విధి నిర్వహణలో అధికారులు అయోమయం

గాజులరామారం సర్కిల్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే అసలు గాజులరామారం సర్కిల్ పరిధికి పట్టణ ప్రణాళిక విభాగం ఉందా...? అందులో అధికారులు ఉన్నది అక్రమాలను అరికట్టడానికా..? లేదా అమ్యామ్యాల కోసం అక్రమారుకులకి వత్తాసు పలకడానికా..? అనే సందేహం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చేతులు తడిస్తే ఎంతటి అక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేస్తారా...? తమ జేబులు నింపుకునే పనిలో అధికారులు ఉంటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న పట్టించుకోరా అని స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గాజులరామారం సర్కిల్ పరిధి పట్టణ ప్రణాళిక అధికారులు కలగజేసుకోని సర్కిల్ పరిధిలో వెలుస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.