calender_icon.png 6 October, 2024 | 8:08 AM

రేప్ కేసులో వీడియో ఆధారాల వీక్షణకు అనుమతి

06-10-2024 01:49:18 AM

ఫ్రాన్స్ కోర్టు సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఓ వ్యక్తి తన భార్య కు మత్తు మందు ఇచ్చి పలువురితో అత్యాచారం చేయించిన ఘటన ఫ్రాన్స్‌లో సం చలనం రేపగా.. కేసు విచారణ సందర్భంగా జడ్జి సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. కేసుకు సంబంధించిన వీడియో ఆధారాల ను కోర్టులో ఉన్న సాధారణ ప్రజలు కూడా వీక్షించవచ్చని వెల్లడించారు.

ఫ్రాన్స్‌కు చెంది న 71 ఏళ్ల నిందితుడు.. భార్యకు కొన్నేండ్ల పాటు రాత్రిపూట ఆమె తినే ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక కొందరు వ్యక్తులను ఇంటికి పిలిచేవాడు. వారు నిందితుడి భార్య తో లైంగికదాడిలో పాల్పడుతుంటే, రహస్యంగా కెమెరాల్లో చిత్రీకరించేవాడు. 2011 నుంచి 2020 వరకు పదేళ్ల పాటు ఈ దారుణాలు జరిగాయని పోలీసులు గుర్తించారు.

2020లో ఓ షాపింగ్ మాల్‌లో నిందితుడు కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండటాన్ని అక్కడి సెక్యూరిటీ గార్డ్ గుర్తిం చి పట్టుకున్నాడు. అనంతరం పోలీసులు అతడి ఫోన్, కంప్యూటర్‌ను తనిఖీ చేయగా.. భార్యపై అతడి ఆకృత్యాలు బయటపడ్డాయి. మొత్తం 72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో 51 మందిని పోలీసులు గుర్తిం చారు.

మిగతా వారి ఆచూకీ తెలియాల్సి ఉం ది. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టగా ఈ కేసుపై బహిరంగ విచారణ చేపట్టాలని బాధితురాలు న్యాయస్థానాన్ని కోరింది. దశాబ్దం పాటు తనకు తెలియకుండా జరిగిన ఇలాం టి దారుణాలపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.