calender_icon.png 17 October, 2024 | 9:56 AM

‘బునియాదిగాని’ పునరుద్ధరణకు అనుమతి

17-10-2024 02:11:36 AM

రూ.266.65 కోట్లతో పర్మిషన్ మంజూరు

98.64 కిలోమీటర్ల పొడవునా కాలువ పునరుద్ధరణ

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని బునియాదిగాని కాలువ పునరుద్ధరణకు రూ. 266.65 కోట్ల తో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. 2023, జూన్‌లో ఈ కాలువ పునరుద్ధరణ పనులను నిలిపివేస్తూ ఉత్త ర్వులు జారీచేశారు.

తదనంతరం ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం అంచనాలు సిద్ధం చేయాలని ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది. తాజా గా ఈఎన్‌సీ రూ.269.46 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. పరిశీలించిన నీటిపారుదల శాఖ రూ.266.65 కోట్లకు పరిపాలనా అనుమతి ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 98.64 కి.మీ. పొడవునా చేపట్టనున్నారు.