calender_icon.png 29 December, 2024 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలి

28-12-2024 07:49:49 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున వైద్యులు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ సంఘం నాయకులు శనివారం జిల్లా వైద్యాధికారి రాజేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్నామని అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సుజాత నాయకులు చంద్రకళ, ఇంద్రమాల, తదితరులు పాల్గొన్నారు.