టెక్ మహీంద్ర సత్యం పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): సత్యం కంపెనీకి చెందిన 2002- -09 మధ్య వాస్తవ ఆదాయంపై ఆదాయపు పన్నును మదింపునకు అనుమతించాలంటూ హైకోర్టు శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)కి ఆదేశాలు జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్ చూపిన ఊహాజనిత ఆదాయంపై పన్ను చెల్లించాలని అధికారులు పట్టుబట్టడం సరికాదని అభిప్రాయపడింది.
సత్యం కుంభకో ణం నేపథ్యంలో 2002- 09 మధ్య వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సీబీడీటీ అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ టెక్ మహీంద్ర సత్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై హైకో ర్టు విచారణ చేపట్టింది.
సత్యం కంపెనీ మా జీ చైర్మన్ రామలింగరాజు లేని ఆదాయం చూపారని, ఆ ఆదాయం ఆధారంగా పన్ను చెల్లించాలనడం సరికాదన్న టెక్ మహీంద్ర సత్యం కంపెనీ తరఫు న్యాయవాది వాదనతో బెంచ్ ఏకీభవించింది. వాస్తవ ఆదాయంతో పన్ను లెక్కించి తాజాగా రిటర్న్స్ సమర్పించాలని సదరు కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ రిటర్న్స్‌ను పరిగణనలోకి తీసుకుని పన్ను రాబట్టాలని సీబీడీటీకి ఆదేశించింది.