calender_icon.png 26 December, 2024 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటా 15 శాతం ఫీజులు పెంచేందుకు అనుమతులివ్వాలి

25-12-2024 02:16:30 AM

* రాష్ట్ర విద్యాశాఖ కమిషన్‌కు ‘ట్రస్మా’ వినతి

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ప్రైవేట్ స్కూళ్లలో ఏటా 15శాతం ఫీజుల పెంపునకు అనుమతులివ్వాలని రాష్ట్ర రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన పలువురు సభ్యులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం ఫీజు గరిష్ఠంగా రూ.35 వేల వరకు ఉందని, ఆ మొత్తాన్ని రూ.50 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రైవేట్ పాఠశాలలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించాలని కోరారు. విద్యాహక్కు చట్టం కింద ఉచిత సీట్లకు సంబంధించిన ఫీజును సైతం నేరుగా విద్యార్థులకే ఇవ్వాలని, రైట్ టు ఫీ కనెక్షన్ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ ఈ అంశాలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.