calender_icon.png 15 January, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలయన్స్ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్‌కు అనుమతి

05-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కింద ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ ప్లాంటు నెలకొల్పడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. తయారీ రంగానికి ప్రోత్సహించేందుకు రూ.3,620 కోట్ల బడ్జెట్‌తో పీఎల్‌ఐ స్కీమ్‌ను గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్ కింద 10 గిగావాట్ల సామర్థ్యంవరకూ బ్యాటరీ తయారీ సదుపాయం ఏర్పాటుకు రిలయన్స్ సమ ర్పించిన బిడ్‌ను ఆమోదించినట్టు బుధవారం ప్రభుత్వ ప్రకటన తెలిపింది. 10 గిగావాట్ల అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) తయారీ కోసం ఈ ఏడాది జనవరి 24న కేంద్రం పీఎల్‌ఐ స్కీమ్ కింద గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.

ఈ టెండర్‌కు స్పంద నగా ఏడు కంపెనీలు బిడ్స్‌ను సమర్పించగా, ఆరు కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ బిడ్‌ను అనుమతించినట్టు అధికారిక ప్రకటన వివరించింది. బిడ్డర్ల ఫైనాన్షియల్, టెక్నికల్ స్కోర్స్‌కు అనుగుణంగా ర్యాంక్ చేశామని, అధిక స్కోరు పొందిన రిలయన్స్ ప్లాంటుకు  భారీ పరిశ్రమల మంత్రి త్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ప్రకటన పేర్కొంది.

షార్ట్ లిస్ట్ చేసిన మిగిలిన ఐదుగురు బిడ్డింగ్ కంపెనీలను వాటి ర్యాంక్‌ల ప్రకారం వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచినట్లు తెలిపింది. ఈ జాబితాలో ఉన్న వెయిట్‌లిస్ట్ బిడ్డర్లు..ఏసీఎంఈ క్లీన్‌టెక్ సొల్యూషన్స్ (వెయిట్‌లిస్ట్ 1), అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ (2), వారే ఎనర్జీస్ (3),  జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ (4), లూకాస్ టీవీఎస్ (5).