calender_icon.png 16 January, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతి

16-01-2025 01:29:53 AM

  1. ఈ విద్యాసంవత్సరానికి అనుమతిని పొడిగిస్తూ సర్కారు ఉత్తర్వులు  
  2. ప్రభుత్వ నిర్ణయంతో 217 కాలేజీలకు ఊరట

హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాం తి): మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవే ట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మినహాయింపునిచ్చింది. 2024  విద్యాసంవత్సరానికి కాలేజీలకు అనుమతులిస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీచేశా రు. ప్రభుత్వ నిర్ణయంతో 217 కాలేజీలకు ఊరట లభించింది.

రాష్ట్రంలో మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న కాలేజీల నిర్వహణకు సంబంధించిన అనుమతి గత విద్యాసంవత్సరంలో ముగిసింది. ఈసారి అనుమతి లేక పోవడంతో విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. ఇటీవల ఇవే కాలేజీల్లో సెకండియర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం అవకాశమిచ్చి, ఫస్టియర్ విద్యార్థుల విషయంపై ఎటూ తేల్చకపోవడంతో అసలు ఈ సంవత్సరం విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తారా?లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు అనుమతినివ్వాలని ఇప్పటికే ప్రైవేట్ కాలేజీల యాజ మాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యం లో తాజాగా ప్రభుత్వం ఈ ఒక్క విద్యాసంత్సరానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసు కుంది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 217 కాలేజీల్లో చదువుతున్న 65 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులకు ఊరట కల్గినట్లయింది.

వచ్చే విద్యాసంవత్సరానికి ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా కాలేజీలకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో సీఎం రేవంత్ రెడ్డికు, హోంశాఖ, విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలంగాణ ప్రైవేట్ కాలేజీల జేఏసీ కన్వీనర్ గౌరీ సతీష్ ఈసందర్భం గా ధన్యవాదాలు తెలిపారు.