బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆశా కార్యకర్తలు
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, నవంబర్ 25 (విజయక్రాంతి): విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజ న్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమ వారం ఎంపీ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు 18 ఏళ్లుగా చాలీచాలని వేతనంతో బతుకీడుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి కొత్త ఫ్యాక్టరీ చట్టం 1946 స్టాండింగ్ సర్వీస్ రూల్స్‌ను విద్యుత్ సంస్థ తెరపైకి తెచ్చి ఆర్టిజన్లను ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులుగా మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వారాంతరపు సెలవు ఇవ్వకుండా అదనపు వేతనం చెల్లించకుండా ఓవర్‌టైం పనిచేయిస్తూ శ్రమ దోపిడీ చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టిజన్ల విద్యార్హతల మేరకు రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ ఇవ్వాలని కోరారు.
ఆశాల డిమాండ్లను పరిష్కరించండి
తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల(ఆశా) న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమ వారం ఎంపీ కార్యాలయయంలో ఆశా కార్యకర్తలు కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల ని, కనీసం వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.