calender_icon.png 5 January, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం

04-01-2025 12:42:11 AM

  1. జూలై 15 లోగా మున్నేరు రిటైనింగ్ వాల్ 
  2. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  3. ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

ఖమ్మం, జనవరి 3 (విజయక్రాంతి): దశాబ్దాల నుంచి ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముంపు సమస్యకు మరో ఏడు నెలల్లోగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నదీ తీరం వెంబడి రూ.690 కోట్లతో 17 కిలో మీటర్ల ఆర్‌సీసీ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు.

జూలై 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను పూర్తి చేసి తీరాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, కలెక్టర్  ముజమ్మిల్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వ  ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..

రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 234 ఎకరాల భూమి అవసరం ఉండగా, అందులో 64 ఎకరాలు ప్రభుత్వ భూము  ఉన్నాయని, 170 ఎకరాలు పట్టా భూములు సేకరించడానికి యజమానులతో మాట్లాడి భూసేకరణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణపై రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి, వివరాలు సమర్పించాలని  కలెక్టర్‌ను కోరారు.

రిటైనింగ్ వాల్ పనులను నెలలో రెండు రోజులు తనిఖీ చేస్తానని చెప్పారు. ప్రతి రోజూ ఎంత  మేరకు పని జరగాలో ప్రణాళిక  తయారు చేసుకోవాలని, పనులు పూర్తి  చేసేందుకు  అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు పనుల పురోగతి వివరాలు వాట్సాప్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు.

మున్నేరు బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాల వివరాలు, ఖమ్మం అర్బన్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వారం రోజుల్లో పూర్తి నివేదిక అందించాలని రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు. భూసేకరణ కోసం సంబంధిత రైతులతో  సంప్రదింపులు జరిపేందుకు నిపుణుల కమిటీ నియమించుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు.

3 లక్షల 50 వేల క్యూసెక్కులు సామర్థ్యం, 15 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల వెడల్పుతో రూరల్, అర్బన్ ప్రాంతంలో 8.5 కిలోమీటర్ల చొప్పున 17 కిలో మీటర్ల మేర రిటైనింగ్ వాల్ కోసం శాస్త్రీయంగా తయారు చేశామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్పారు. సమావేశంలో ఆర్డీవో నరసింహారావు, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ హేమలత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక  అధికారి రమేశ్, పాల్గొన్నారు.  

సంక్రాంతికి ‘డబుల్’ ఇళ్ల పంపిణీ 

సంక్రాంతి వరకు డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గంలో మొత్తం 131 ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

209 ఇండ్లు వివిధ దశల్లో  ఉన్నాయని, వీటికి కూడా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, కేటాయించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పర్యటించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 

ఎం వెంకటాయపాలెం నుంచి గోళ్లపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు,  కాచిరాజుగూడెం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, చింతపల్లి ఆరెకోడు తండా నుంచి తిరుమలాయపాలెం బీటీ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ రఘురామరెడ్డి పాల్గొన్నారు. 

కొత్తగూడెం అభివృద్ధికి కృషి

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. సుజాతనగర్ మండలంలోని వేపలగడ్డ గ్రామం నుంచి బృందావనం వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడు  ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం నియోజకర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఏటా జనవరి 3న సావిత్రీ  పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం కాలేజీ ఆవరణలో రైఫిల్ షూటింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.

అనంతరం పాల్వంచ మండలంలోని రెండ్డి  గ్రామం  హైలెవల్ వంతెనకు శంకుస్థాసన చేశారు. సీతారాం  నుంచి పాం డురంగాపురం గ్రామం వరకు చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్  పాల్గొన్నారు.