calender_icon.png 9 January, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగు, సాగునీటి కొరతకు శాశత పరిష్కారం

23-07-2024 12:55:51 AM

  • ప్రభుత విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి 

జగిత్యాల, జూలై 22 (విజయక్రాంతి): నియోజకవర్గంలో తాగు, సాగునీటి కొరత లేకుండా శాశత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు ప్రభుత విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సోమవారం ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలోని ఫిల్టర్ బెడ్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మపురి మున్సిపాలిటీతో పాటు మండల ప్రజలకు శాశత నీటి పరిష్కారం చూపే విధంగా అమృత్ స్కీమ్ కింద సుమారు రూ.17 కోట్లతో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తామని, కమలాపుర్ ఫిల్టర్ బెడ్ నుంచి పైప్ లైన్ దారా నీటిని నింపి ఈ ప్రాంతానికి నీరు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. ఆయనవెంట మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.