calender_icon.png 22 April, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలకు 'భూ భారతి' తో శాశ్వత పరిష్కారం

22-04-2025 05:26:21 PM

పెన్ పహాడ్: భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్(District Collector Tejas Nandlal Pawar) తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం-2025 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున అమల్లోకి తీసుకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూ భారతి చట్టంలో తాసిల్దార్ స్థాయి నుండి సీసీఎల్ఎస్ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పించారని తెలిపారు.

భూమి రిజిస్ట్రేషన్ ముందు తప్పనిసరిగా భూ సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ప్రతి రైతుకి నూతన వన్ బి అందజేస్తామని తెలిపారు. గ్రామాలలో ప్రతి ఒక్కరి భూమికి భూదాన్ నెంబరు కేటాయించి సరిహద్దులు నిర్వహించి సర్వే మ్యాప్ ని భూభారత్ పోర్టల్లో అప్డేట్ చేస్తామని తదుపరి ప్రజలు పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.

ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిపి సరిచేసుకోవాల్సిందిగా తేలిపారు. భూ భారతి ఫోర్టల్ లో అన్ని సమస్యలకు స్వయంగా దరఖాస్తు చేసుకునేలా రూపొందించినట్టు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందని జూన్ మాసంలో సదస్సులు నిర్వహించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణుమాధవ్, తాసిల్దార్ ధరావత్ లాలు నాయక్, సూర్యపేట తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు, ఏఓ అనిల్ కుమార్, ఏపియమ్ అజయ్ నాయక్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.