calender_icon.png 30 April, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

30-04-2025 12:11:33 AM

కడ్తాల, తలకొండపల్లిలో భూభారతి అవగాహన సదస్సు 

హాజరైన కలెక్టర్ నారాయణరెడ్డి,

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కడ్తాల్ / తలకొండపల్లి, ఏప్రిల్ 29 : భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టం ద్వారా అన్నిరకాల భూ సమస్యలు తొలగిపోతాయని ఆయన పేర్కొ న్నారు. మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం లోని కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాలలో ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన భూ భారతి చట్టం-2025 అవగాహన సద స్సు నిర్వహించారు. సదస్సుకు కలెక్టర్ ము ఖ్యఅతిథిగా హాజరు కాగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టంలో భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు ఇబ్బందులు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం ప్రభు త్వం భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు . ప్రతి రైతుకు ఆధార్కార్డులాగ నే....భూదార్ కార్డు ఇవ్వనుందని, దీనివల్ల భూములకు సంబం ధించిన అన్ని రికార్డులు సులభంగా పొందవచ్చు అని తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్, సాదా బైనామాల సమస్యలు, సరిహద్దు వివాదాలు, మ్యూ టేషన్, రిజిస్ట్రేషన్ వంటి అంశాలు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

రైతుల సర్వే సమస్యలను పరిష్కరించేందుకు లైసెనస్డ్ సర్వే యర్లను నియమించనుందని, దీనిద్వారా భూములకు సంబందించిన వివాదాలు సర్వే చేసి మ్యాపులతో పట్టా పాస్ పుస్తకంలో చేర్చుకోవడా నికి అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్, గిఫ్ట్డీ డ్, పార్టిషన్, మ్యూటేషన్, ల్యాండ్ ఎక్స్చేంజ్, వా రసత్వం వంటి చిన్న సమస్యలు తహసీల్దార్ స్థాయిలో పూర్తి అవుతా యని కలెక్టర్ వివరించారు. ఓఆర్సీ, ఇనామ్, అసైన్మెంట్, సీలింగ్, ల్యాండ్, లోక్‌అదాలత్ తదితర భూ సమస్యలు ఆర్డీవో స్థాయిలో పరిష్కరిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ నూతన భూ భారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ డవలప్ మెంట్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, పోలిషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, తహశీల్ధార్లు ముంతాజ్ బేగం, నాగార్జున, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సింగల్ విండో చైర్మనులు వెంకటేష్ గుప్తా, కేశవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీడీఓ సుజాత, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి నర్సింహా రెడ్డి, బీచ్యా నాయక్, ప్రభాకర్ రెడ్డి, చేగూరి వెంకటేష్, నరేష్ నాయక్, బాల్ రాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.