calender_icon.png 20 April, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాలకు తావు లేకుండా భూభారతి

20-04-2025 12:37:49 AM

మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి

చేవెళ్ల, ఏప్రిల్ 19 : ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వం ‘భూ భారతి’ తీసుకొచ్చిందని మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇకనుంచి భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు ముందే సర్వే, మ్యాప్ లు తయారుచేసి భూ హక్కులను పకడ్బందీగా అమలుపరుస్తామని వెల్లడించారు. శనివారం చేవెళ్ల మున్సిపల్ పరిధి పద్మావతి కన్వెన్షన్ హాల్, శంకర్పల్లిలోని బద్దం మాణిక్యరెడ్డి గార్డెన్లో నిర్వహించిన ‘భూ భారతి’ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతం లో పరిష్కారం కాని భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు.

ఇదివరకటి లాగా ప్రతీది కలెక్టర్ లాగిన్కు వెళ్లకుండా సమస్యను బట్టి తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కరించుకునే వీలుంటుందన్నారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. ఈ చట్టం ద్వారా పైరవీలకు తావులేకుండా భూసమస్యలు పరిష్కరించుకోచ్చన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. భూ సమస్యలను సులభతరంగా పరిష్కరించుకునే విధంగా భూభారతి రూపొందించడం జరిగిందన్నారు. ఆధార్ లాగా భూధార్ వ్యవస్థను తీసువచ్చే విధంగా కృషి చేస్తున్నామని, కబ్జాలు, ఆక్రమణలకు ఇక భవిష్యత్లో చోటు ఉండదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, సీనియర్ నాయకులు సున్నపు వసంతం, మర్పల్లి కృష్ణారెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్లు కృష్ణయ్య, సురేందర్, చేవెళ్ల డీటీ రాజేంద్ర, ఎంపీడీవోలు హిమబిందు, వెంకయ్యగౌడ్, ఎంపీవో విఠలేశ్వర్ జీ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజాఆగిరెడ్డి, సంబంధిత అన్ని శాఖల అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు