calender_icon.png 7 November, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థికో పర్మనెంట్ నంబర్

07-11-2024 12:57:46 AM

  1. ఆధార్ తరహాలో అపార్ (పెన్) కార్డు 
  2. ఎల్‌కేజీ నుంచి పీజీ విద్యార్థులకు అందజేత
  3. మెదక్ జిల్లాలో ప్రారంభమైన జారీ ప్రక్రియ

మెదక్, నవంబర్ ౬ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ వి ద్యాసంస్థల్లో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు పర్మనెంట్ నంబ ర్ గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు. విద్యార్థుల సమగ్ర సమాచారం క్రోడీకరించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నారు.

ఆధార్ తరహాలో వన్ నేషన్ వన్ ఐడీ పేరుతో 17 అంకెలు ఉండే అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డును కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) పేరు తో ప్రతి విద్యార్థికి కేటాయిస్తుంది. కార్డుల జారీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. 

జిల్లా విద్యాశాఖ యూనిట్‌గా

ప్రతి విద్యార్థికి శాశ్వత ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య ఇవ్వనున్నారు. జిల్లా విద్యాశాఖను యూనిట్‌గా తీసుకొని ప్రతి మండలం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య, వారి వివరాలన్ని విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

కాగా, ఈ అపార్ కార్డు ద్వారా ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ సులభతరం అవుతుంది. రివార్డులు, డిగ్రీలు, స్కాలర్‌షిప్‌లు, ఇతర క్రెడిట్‌లు వంటి పూర్తి అకడమిక్ డేటాను డిజిటలైజేషన్ చేయనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు చదివే ప్రతి విద్యార్థికి పాఠశాల, కళాశాలలు ఈ కార్డులను జారీ చేస్తాయి. 

ఒకటే నంబర్

వివిధ కారణాలతో తల్లిదండ్రుల బదిలీ అయినప్పుడు విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరినా పర్మనెంట్ నంబర్ మారదు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యను లెక్కించేందుకు, ఉచిత పుస్తకాలు, స్కూల్ యూనిఫాంలు లెక్కించేందుకు, మధ్యాహ్న భోజనం సద్వినియోగమయ్యేలా ఈ కార్డు ఉపయోగపడుతుంది. 

విద్యార్థి పూర్తి సమాచారం తెలిసేలా..

కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో విద్యార్థుల కోసం కొత్త కార్డును అందుబాటులోకి తెచ్చింది. అదే అపార్ లేదా పెన్ కార్డు. పాఠశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో యూడైస్‌లో విద్యార్థుల వివరాలను నమోదు చేసే క్రమంలో ఆటోమేటిక్ పెన్ నంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి పాఠశాలలో హెచ్‌ఎంలు విద్యార్థులకు టీసీ ఇచ్చే క్రమంలో టీసీపై ఈ నంబర్‌ను తప్పనిసరిగా రాయాలి. దీంతో విద్యార్థి పూర్తి సమాచారం తెలుస్తుంది. మెదక్ జిల్లాలో కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాం.

 రాధాకిషన్, 

జిల్లా విద్యాధికారి, మెదక్