calender_icon.png 6 March, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెర్కపల్లి వాసికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్

06-03-2025 06:45:00 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన సింగతి ఉపేందర్ కి స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లంలో రాసిన భారతీయ నాటకాల మీద పరిశోధన చేసినందుకు గానూ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. ఉపేందర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ కె. ఎం.ప్రవీణ పర్యవేక్షణలో "ఎర్లీ ఇండియన్ డ్రామా ఇన్ ఇంగ్లీష్ ఎ స్టడీ ఆఫ్ సెలెక్టెడ్ ప్లేస్ ఆఫ్ ప్రి ఇండిపెండెన్స్ ఎరా అనే అంశంపై పరిశోధన జరిపి థీసిస్ ను రాసి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపేందర్ డాక్టరేట్ అందుకోవడం పట్ల అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.