calender_icon.png 30 November, 2024 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వర్తించి ఉన్నత స్థాయికి చేరాలి

30-11-2024 04:26:54 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి. తొమ్మిది నెలలు ప్రాథమిక శిక్షణను పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన 78 మంది పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది నెలల పాటు బేసిక్ ట్రైనింగ్ ను పూర్తి చేసుకొని జిల్లాలో విధులను నిర్వర్తించడానికి కేటాయించబడిన 78 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ తో హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. ఇందులో 28 మంది సివిల్ కానిస్టేబుళ్లు (పురుషులు), 17 మంది ఉమేన్ కానిస్టేబుళ్లు, 25 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు (పురుషులు), 08 మంది ఏఆర్ ఉమేన్ కానిస్టేబుళ్లు మొత్తం 78 మంది రిపోర్ట్ చేయడం జరిగింది. 

పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలలో పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ బాధ్యతగా తమ యొక్క కేటాయించిన విధులను నిర్వర్తించాలని తెలిపారు. విధులు పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. నీతి, నిజాయితీతో పనిచేసే వారికి పోలీస్ శాఖలో ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అన్నారు. కష్టపడి సాధించిన ఉద్యోగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఉన్నత స్థాయికి చేరాలని తెలియజేసారు. ప్రస్తుతం పోలీస్ శాఖలో వినియోగిస్తున్న సాంకేతికతపై అవగాహన పెంచుకుని దానికనుణంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.