calender_icon.png 22 April, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబద్ధత తో విధులు నిర్వహించాలి

22-04-2025 12:02:51 AM

దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకురాలు బి శైలజ

మలక్పేట, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ట్రాఫిక్ అసిస్టెంట్లు గా విధుల్లో చేరిన ట్రాన్స్ జెండర్లు విదులను నిబద్దత, క్రమశిక్షణతో నిర్వహించాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకురాలు బి. శైలజ అన్నారు. సోమవారం దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాల య ప్రాంగణంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించబడిన ట్రాన్స్ జెండర్లు దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజను సన్మా నించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తోనే ట్రాన్స్ జెండర్లకు  ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించబడ్డారు. క్రమశిక్షణ తో విధులను నిర్వహించాలని సూచించారు.  భవిష్య త్తులో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ట్రాన్స్ టెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా  నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

అదే విధంగా త్వరలో హైడ్రాకు కూడా నియమాకాలు జరిగే విధంగా కమిషనర్ తో మా ట్లాడతానని ఆమె తెలిపారు. సమస్యలు ఉం టే కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ అరుణ, పర్యవేక్షణాధికారి అభివర్మ,  ట్రాన్స్ జెండర్స్ స్టేట్ కో ఆర్డినేటర్ ప్రీతి సు నంద, జయంతి తదితరులు పాల్గొన్నారు.