calender_icon.png 20 April, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమర్థవంతంగా విధులు నిర్వహించండి

17-04-2025 01:09:07 AM

- బండ్లగూడ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 17 : సిబ్బంది ఎప్పటికప్పుడు తమకు అప్పగించిన పనులను సమర్థవంతగా విధులు నిర్వహించాలని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చంద్ర సూచించారు. బుధవారం ఆయన బండ్లగూడ జాగిర్ కిస్మత్పూర్ లోని కార్యాలయం కౌన్సిల్ హాల్ లో సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

తాగునీటి వనరులు, ఇందిరమ్మ ఇం డ్లు రీవెరైఫికేషన్, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, ఎల్‌ఆర్‌ఎస్ సర్వే, అడ్వర్ టైస్మెంట్ పన్నుల వసూలు, పర్మనెంట్ మైగ్రేషన్ పెన్షన్స్ వెరిఫికేషన్, మహిళా సంఘాల ద్వారా స్కూల్ యూనిఫామ్ తయారీ, నూతన సంఘాల ఏర్పాటు, వార్డులలో పారిశుద్ధ్య పనులు నిర్వహణ, ట్రేడ్ లైసెన్స్ ల జారీ, స్వచ్ఛ సర్వేక్షన్-2025 సిటిజన్ ఫీడ్ బ్యాక్, ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్స్, ఆన్-అస్సెస్డ్, అండర్ అస్సెస్డ్ పన్ను విధింపు, ఇంజినీరింగ్ విభాగంలో వివిధ వార్డులలో అభివృద్ధి పనుల పురోగతి, నూతన పనులు చేపట్టుట, వన మహోత్సవంలో లక్ష్యం వారీగా మొక్కలు పెంచుట, నాటిన మొక్కల సంరక్షణ, నర్సరీ నిర్వహణ, ఆర్ధిక సంవత్సరం 2025-26 లో టార్గెట్స్, వివిధ వార్డులలో వీధి దీపాల నిర్వాహణ, నూతన లైట్లు ఏర్పాటు రిపైర్స్, భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు విడుదల, అక్రమ నిర్మాణల పై చర్యలు, కోర్టు కేసుల పై సమీ క్షించారు. ఈ సమావేశంలో మేనేజర్ మంజులత, డిప్యూటీ ఈఈ యాదయ్య, ఆయా సెక్షన్ల అధికారులు, సెక్షన్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు,వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.