08-04-2025 12:00:00 AM
ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ
గజ్వేల్, మార్చి 7 : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. సోమవారం గజ్వేల్ లోనీ ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. వరల్ హెల్త్ ఆర్గనైజేషన్ 2025 థీమ్ ప్రకారం ఆరోగ్య కరమైన జీవితంతో ప్రారంభమై భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలన్నారు.
కలుషితమైన ఆహా రం, నీరు, గాలి ఆరోగ్యానికి ముప్పన్నారు. హాస్పిటల్ లో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రజలందరూ ఆరోగ్య సేవలు పొందాలన్నారు. నర్సింగ్ సూపరిండెంట్ స్వరూప రాణి మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని తన చేతిలో ఉంచుకోవాలని, వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలన్నారు.
ఏమైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే దగ్గరలో ఉన్న ఆశ వర్కర్, ఏఎన్‌ఎంలను సంప్రదించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిద్దామని, ఆరోగ్య సమాజానికి పునాదులు వేద్దాం అంటూ నినాదాలు చేస్తూ హాస్పిటల్ సిబ్బంది ప్రజలకు, రోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఓ డాక్టర్ రాము, డ్యూటీ డాక్టర్ నవ్య రావు, డాక్టర్ తర్జని, హెడ్ నర్సు విజ యలక్ష్మి , ఫార్మసిస్టులు నర్సింలు, శ్రీనివాసచారి, హెల్త్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.