calender_icon.png 25 October, 2024 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యవేక్షణ పేరుతో పర్సంటేజీలు

12-09-2024 12:08:26 AM

  1. ఆదాయ వనరులుగా అంగన్‌వాడీలు 
  2. టీచర్లపై సూపర్‌వైజర్ల జులుం  
  3. అడిగినంత ఇవ్వకుంటే ఫిర్యాదులు
  4. ఒత్తిళ్లతో టీచర్ మృతి

భధ్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖలో పర్యవేక్షణ అధికారుల వేధింపులు అధికమయ్యాయని, పర్యవేక్షణ పేరుతో ప ర్సంటేజీలు గుంజుతున్నారంటూ అంగన్‌వా డీ టీచర్లు లబోదిబోమంటున్నారు. జిల్లా లో 11 ప్రాజెక్టుల పరిధిలో 2,060 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 3 ను ంచి 6 సంవత్సరాల చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ, ఆటపాటలతో విద్య నేర్పడంతోపాటు, బాలింతలకు, గర్భిణీలకు బాలా మృతం, ఆరోగ్యలక్ష్మి పథకాలు అమలు చే స్తూ వారికి  పౌష్టికాహరం అందిస్తుంటారు. 

రూ.5 వేల చొప్పున వసూలు..

కేంద్రాల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు నియమించిన సూపర్‌వైజర్లు వారిపై జులుం చలా యిస్తూ దండుకొంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అంగన్‌వాడీ సంఘాల పోరాట ఫలితంగా ప్రభుత్వం మినీ అంగన్‌వాడీలను, మెయిన్ అంగన్‌వాడీలుగా అభి వృద్ధి చేసింది. దాన్ని కూడా సూపర్‌వైజర్లు ఆదాయ వనరులుగా మలచుకొన్నట్లు తెలుస్తోంది.  మినీ నుంచి మెయిన్ అంగన్‌వాడీ లకు మారిన ప్రతి కేంద్రం నుంచి ఆయా ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు రూ.5 వేల చొప్పున వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

మినీ అంగన్‌వాడీ నుంచి మెయిన్ అంగన్‌వాడీలకు మార్చిన కేంద్రాల్లో ఆయాలను ప్రభుత్వం నియమించలేదు. అదే వారికి అవకాశంగా మలచుకొ ని ఆయాలను వేతనాలు చెల్లించి ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే నెలకు రూ.3 వేలు మాకు చెల్లిస్తే మీరు కేంద్రాల్లో ఏ వంటలు చేసినా, చేయకున్నా తాము పట్టించుకోబోమంటూ వసూళ్ల పర్వానికి తెర లేపారు. లేదంటే నూరుశాతం విద్యార్థులు రావడంలేదని, గుడ్లు, పాలు, కందిపప్పు పంచడంలే దని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. 

మెమో జారీ చేశాం..

జిల్లా వ్యాప్తంగా సూపర్‌వైజర్ల వేధింపులకు అంగన్‌వాడీ టీచర్లు బెంబేలెత్తుతున్నారు. చివరకు సూపర్‌వైజర్ శారద వేధింపు లు తాళలేక పాల్వంచ ఐసీడీఎస్ అధికారి ల క్ష్మీప్రసన్నకు, ఐసీడీఎస్ పీడీ కార్యాయలం లో కొంతమంది అంగన్‌వాడీ టీచర్లు రాతపూర్వకంగా తగిన ఆధారాలతో ఫిర్యాదు చే శారు. ఈ విషయమై పాల్వంచ సీడీపీఓ లక్ష్మీప్రసన్నను వివరణ కోరగా శారదపై ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, ఆమెకు మె మో జారీ చేసి సంజాయిషీ కోరామన్నారు. ఆమె ఇచ్చే సమాధానంతో పీడీకి నివేదిక అందజేస్తామన్నారు. 

వేధింపులు భరించలేక..

పాల్వంచ పట్టణ పరిధిలోని షిర్డీసాయి నగర్ సెక్టార్ సూపర్ వైజర్ శారద మరింత ఒకడుగు ముందుకు వేసి తన పరిధిలోని రామలక్ష్మి, జ్యోతి, రాధ, కృష్ణవేణితో పాటు మరి కొందరి నుంచి నెలకు రూ. 3వేలు ముక్కుపిండి వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆమె వేధింపులు తట్టుకోలేక తీవ్ర ఒత్తిడితో నవభారత్‌కు చెందిన వెంకటరమణ అనే అంగన్‌వాడీ టీచర్ మృతి చెందినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ చనిపోయిన రోజు శవాన్ని చూడటానికి సిబ్బందిని కూడా వెళ్లనివ్వలేదంటే ఆమె వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మచ్చు తునక మాత్రమే.