రెండు రోజులుగా అధికారుల, సిబ్బంది మధ్య వాగ్వాదం
సిరిసిల్ల రేంజ్ ఆఫీస్లో ఘటన
సిరిసిల్ల, నవంబర్ 9 (విజయక్రాంతి): అటవీ సంపదను కాపా డాల్సిన అధికారులు విధులను పక్కన పెట్టి పర్సెంటేజీల కోసం కొ ట్లాడుకుంటున్నారు. రెండు రోజులుగా సిరిసిల్ల రేంజ్ ఆఫీస్లో సాగు తున్న లొల్లి జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పలు అభివృద్ధి పనుల కోసం అధికారులకు వ్యాపారులు చెల్లించిన బిల్లు ల్లో పర్సెంటేజీల కోసం అధికారులకు, సిబ్బందికి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరినట్లు సమాచారం.
రెండు రోజులుగా ఆఫీస్లో వాగ్వా దం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. స్థానిక ఎఫ్ఆర్వో, సెక్షన్ అధి కారుల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. జిల్లా స్థాయి అధికారులకు, ఆఫీస్ సిబ్బంది, సెక్షన్ ఆఫీస ర్లు, బీట్ ఆఫీసర్ల మధ్య జరగాల్సిన పంపకాలపై జోరుగా చర్చ సాగినట్లు సమాచారం. అయితే ఈ విషయమై స్థానిక ఎఫ్ఆర్వో కల్పనాదేవిని వివరణ కోరగా అలాంటిదేమీ లేదని, రేపు విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.