calender_icon.png 2 April, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్సంటేజీల పంచాయతీ?

01-04-2025 12:29:29 AM

  1. అధికారులు కాంట్రాక్టర్ల మధ్య అంతర్యుద్ధం
  2. ఓకే అయితే నిబంధనలు బేఖాతరు 
  3. నాణ్యత సంగతి దేవుడెరుగు

మహబూబ్ నగర్ మార్చి 31 (విజయ క్రాంతి) : పంచాయతీలలో పక్కగా రోడ్ల తో పాటు ఇతర నిర్మాణాలను పక్కాగా కాంట్రాక్టర్లతో చేపించేందుకు ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయ డం జరిగింది. కాగా అధికార యంత్రాంగం ఆ శాఖ ఎందుకు ఉందో అనే విషయాన్ని మర్చిపోయినట్లు కనిపిస్తుంది.

ప్రతి పనికి ఓ పర్సెంటేజీ అధికారి హోదాన్ని బట్టి అంతర్లింగానే పర్సంటేజీల పర్వం కొనసాగు తుందని ఆరోపణలు బలంగా ఉన్నాయి. పనులు చేయించడంలో పర్సంటేజీలు తీసుకుంటున్నట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను చూస్తే పర్సంటేజ్ లో ఉన్నందుకే ఈ పనులు ఇలా నాసిరకంగా ఉన్నాయని ఆలోచన మనకు తప్పదు.

నిబంధనలో 100% పాటించకపోయిన పరవాలేదెమో కనీస నిబంధనలు పాటించిన వేసిన సిసి రోడ్లతోపాటు నిర్మించిన బిల్డింగులు కూడా నాణ్యతతో ఉండే అవకాశం ఉంటుంది. నామమాత్రంగా పర్యవేక్షణ చేయడం ద్వారా నిర్మాణంలో నాణ్య త లోపిస్తుంది. అధికారులు పర్యవేక్షణ తగ్గింది.. పనులు చేయకంటే ముందే ఆ పనులకు ఉపయోగిస్తున్న సిమెంటు, కంకర, ఇసుకలతో ట్యూబ్ టెస్ట్ చేయవలసి ఉం టుంది.

దాదాపు 15 రోజులపాటు ఈ టెస్ట్ కి సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత 80 క్వాలిటీ ఉన్నట్లు తేలాలి. అప్పుడే నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకు ఉపయోగించి నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాగా అవేవి ఇక్కడ పట్టవు. అధికారులకు ఈ టెస్టులు చేయడమే మర్చిపోయారు..

కేవలం నమామాత్రంగా పర్యవేక్షణ చేస్తూ పనులు చేశారా ? బిల్లులు మంజూరు చేసామా ? మళ్లీ కొత్త పని వచ్చిందా మరో కాంట్రాక్టుకు ఇచ్చామా ? అది పూర్తయిందా ? ఈ విధానంతోనే యేండ్ల తరబడి సిసి రోడ్లతో పాటు వివిధ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. 

-అసలు నిబంధనలు ఎందుకు ఉన్నట్టు...?

ఒక్క క్షణం ఆలోచించండి... ప్రతినెల ఒక సామాన్యుడు నల్ల బిల్లు కట్టకుంటే ముక్కు పిండి వసూలు చేస్తున్న అధికార యంత్రాం గం కోట్లాది రూపాయలు దుర్యోగం అవుతున్న ఎందుకు నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందో ఆలోచించండి. తప్పు ఎక్కడ జరుగుతుంది ? ఎందుకు జరుగుతుంది..?

ఇలా నాణ్యత లేని సిసి రోడ్లు వేసి బిల్లులు మంజూరు చేసి తీరా అది గ్రేస్ పీరియడ్ కాకముందే వేసిన సిసి రోడ్డు పోయినప్పటికీ కూడా సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నత అధికారులు, సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తేనే ప్రభు త్వం లక్షలను .. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలను నిజం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

- ఎవరు బాధ్యులు...?

పర్యవేక్షణ చేయవలసిన పంచాయతీరాజ్ శాఖ సిసి రోడ్లతో పాటు ఇతర నిర్మాణ పనులలో అంతంత మాత్రమే పర్యవేక్షణ చేస్తుంది. క్వాలిటీ కంట్రోల్ అనుమతులు కూడా కొన్ని విభాగాలలో ప్రైవేట్ వారికి సైతం ఇవ్వడం జరిగింది. ఎవరి లెక్క వారు తీసుకొని ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తే నష్టపోయేది జనమే.. జనం చెల్లించిన పన్ను రూపకంగా వచ్చిన డబ్బులు.. ఇలా ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణ్యతగా అందవలసిన పనులు అందడం లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దేవరకద్ర నియోజకవర్గంలో ఇటీవల సిసి రోడ్లు వివిధ పనులు వేగవంతంగా జరిగాయి. సంబంధిత అధికారులతో కాంట్రాక్టర్లు పర్సంటేజ్ లకు సంబం ధించి అంతర్లేనంగా గొడవకు దారి తీసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకనైనా ఉన్నత అధికార యంత్రమైన కనీసం నెలలో ఒక్కసారైనా గ్రేస్ పీరియడ్ పూర్తి చేసుకున్న సిసురులను పరిశీలించి బాధ్యతలపై చర్యలు తీసుకుంటే వేస్తున్న రోడ్లు నాణ్యతగా వేసే అవకాశం ఎంతైనా ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. 

-పర్సంటేజీ అనేది ఉండదు...

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సిసి రోడ్లు, వివిధ బిల్డింగ్ నిర్మాణం చేపట్టినప్పటికీ ఎక్కడ కూడా కాంట్రాక్టర్ నుంచి పర్సెం టేజీలు తీసుకునే పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నాం. నా పరిధిలో ఒక ఫైల్ కూడా పెండింగ్ పెట్టను. అలా పెడితే పర్సంటేజ్ కోసమే ఆపినట్లు తెలుస్తుంది.

నా కింది స్థా యి అధికారులు ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు పెడితే నా దృష్టికి రాలేదు. అలా వస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్టర్ నుంచి పర్సంటేజ్ తీసుకొని పనులు నాణ్యత లేకుండా చేయవలసిన అవసరం లేదు. ప్రతి పనిలోనూ నాణ్యతను పాటిస్తున్నాం. 

నరేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈ ఈ, మహబూబ్ నగర్ జిల్లా