calender_icon.png 19 November, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

65.02శాతం సర్వే పూర్తి

19-11-2024 12:48:36 AM

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర సర్వే వేగంగా సాగుతోంది. సోమవారం నాటికి రాష్ట్రంలో 65.02 శాతం సర్వే పూర్తయినట్టు ప్రణాళికా శాఖ తెలిపింది. మొత్తం 1.16 కోట్ల ఇళ్లలో 75,75,647 గృహాల్లో సర్వే పూర్తయినట్టు వెల్లడించింది. అత్యల్పంగా జీహెచ్‌ఎంసీలో 44.3 శాతం ఇళ్లలో సర్వే జరగ్గా.. అత్యధికంగా ములుగులో 95.3 శాతం ఇళ్లలో వివరాల నమోదు పూర్తయినట్టు చెప్పింది.

ములుగులో మొత్తం ఇళ్లు 97,552 కాగా.. 92,928 ఇళ్లు పూర్తయ్యాయి. 89.1 శాతంతో నల్లగొండ రెండో స్థానంలో ఉంది. 86 శాతంతో జనగామ మూడోస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో మొత్తం ఇళ్లు 25,05,517 కాగా.. ఇప్పటి వరకు 11,10,883 మాత్రమే పూర్తి కావడం గమనార్హం.