జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26(విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గ్రేటర్‌లో 81.96శాతం సర్వే పూర్తయిందని.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఇప్పటివరకు 19.62 లక్షల కుటుంబాలకు సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
సర్వే వివరాల డేటా ఎంట్రీకి అవసరమైన ఆపరేటర్లను సిద్ధం చేయాలని అధికా రులను ఆదేశించారు. గ్రేటర్‌లో సర్వే ముమ్మరంగా సాగుతోందని.. డోర్‌లాక్ ఉన్న ఇండ్లను గుర్తించి వారు తమ సొంత ఊర్లలో నమోదు చేసుకున్నారో లేదో తెలుసుకోవాలని.. అలా నమోదు చేసుకోకుంటే నమోదు చేసేకునేలా ఏర్పాటు చేయాలన్నారు.
తదనంతరం హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఇతర అధికారులతో కలిసి ఆరాంఘర్ ఫ్లు ఓవర్‌ను ఇలంబర్తి పరిశీలించారు. నవంబర్ 30వరకు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనవెంట సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్ వెంకన్న, ఎస్‌ఈ దత్తుపంతు, డిప్యూటీ కమిషనర్లు రవికుమార్, అరుణ, ఈఈ, డిప్యూటీ ఈఈలు, ఇతర అధికారులు ఉన్నారు.