calender_icon.png 23 November, 2024 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్‌లో 67.51 శాతం సర్వే పూర్తి

23-11-2024 12:11:19 AM

  1. మేయర్ గద్వాల విజయలక్ష్మి 
  2. నగరంలోని పలు ప్రాంతాల్లో సర్వేను పర్యవేక్షించిన మేయర్  

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. నగరవ్యాప్తంగా 67.51 శాతం పూర్తయ్యిందని  జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం నగరంలోని బంజారాహిల్స్ శ్రీరామ్‌నగర్, కాచిగూడ చెప్పల్ బజార్ కాలనీల్లో కొనసాగుతున్న సర్వే తీరును మేయర్ పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ నగర్‌లో ఎన్యూమరేటర్ సర్వే ఫారంను పెన్సిల్‌తో నింపుతూ కుటుంబ సభ్యుల నుంచి పెన్నుతో సంతకం చేయించుకోవడాన్ని గమనించిన మేయర్ ఎన్యూమరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే ఫాంలు నింపే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్సిల్ వాడొద్దని ఎన్యూమరేట ర్లను ఆదేశించారు.

పెన్సిల్‌తో సర్వే ఫారం నింపుకొని సర్వే చేపట్టిన కుటుంబ సభ్యులతో పెన్నుతో సంతకాలు తీసుకోవడం వలన ప్రజలకు అపోహలు పెరుగుతాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వేలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. ప్రజలు పూర్తి వివరాలు ఇస్తున్నారా.. సర్వే ఎందుకు చేస్తున్నామనే విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారా అంటూ ఆరా తీశారు.

ప్రజల నుంచి సర్వేకు మంచి స్పందన వస్తుందని ఆమె తెలిపారు. సర్వే పూర్‌గా ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో ఎల్‌బీ నగర్ జోన్‌లో ఎక్కువ శాతం, సికింద్రాబాద్ జోన్‌లో తక్కువ శాతం సర్వే జరిగిందన్నారు. మేయర్ వెంట  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.