- డాటా ఎంట్రీలో తప్పులుండొద్దు: సీఎస్
- వివరాలు నమోదు చేసుకున్న సీఎస్, స్పీకర్
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో శనివారం నాటికి కులగణన 90 శాతం పూర్తయ్యింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తి కాగా.. మరికొన్ని జిల్లాల్లో 90 శాతానికి దాటింది. సర్వే ముంగిపు దశకు రాగా సేకరించిన డాటా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,16,93,698 ఇళ్లను గుర్తించగా.. ఇప్పటి వరకు 1,05,03,257 నివాసాల్లో సర్వే ముగిసింది. అలాగే 2,61,384 నివాసాలకు సంబంధించిన వివరాల కంప్యూటరీకరణ పూర్తయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలకు గానూ 17,47,056 ఇళ్ల సర్వే పూర్తయ్యింది.
శనివారం హైదరాబాద్ సీఎస్ శాంతికుమారి, వికారాబాద్‌లోని తన క్యాంప్ ఆఫీస్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వివరాలను నమోదు చేసుకున్నారు.
తప్పులు దొర్లొద్దు: సీఎస్
సీఎస్ ఆదేశాల మేరకు శనివారం నుంచి అన్ని జిల్లాలో డాటా ఎంట్రీ మొదలైంది. తప్పులు లేకుండా సర్వే వివరాలను ఆన్‌లైన్ చేయాలని శాంతికుమారి ఆదేశించారు. సర్వే పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.