20-03-2025 12:00:00 AM
ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన
పెద్దపల్లి, మార్చి19 (విజయక్రాంతి): జిల్లాలో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం సంవత్సరం పరీక్షకు 96.26 శాతం విద్యార్థులు హాజరు అయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఈ పరీక్షకు (4984) మంది హాజరు కావాల్సి ఉండగా, (4798)మంది హాజరు కాగా,(186) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, బుధవారం 96.2 శాతం హాజరు నమోదు కావడం జరిగిందని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి కల్పన ఆ ప్రకటనలో తెలిపారు.