సిరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
డమాస్కస్, జనవరి 6: సిరియాలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 400 శాతం జీతాలు పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్థికమంత్రి మహమ్మద్ అబ్జాద్ ప్రకటించారు. 1.65 ట్రిలియన్ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చ నున్నట్లు తెలిపారు.
ఆర్థిక వ్యవస్థను స్థీరికరించేందుకు జీతాల పెంపు నిర్ణ యం తీసుకున్నట్లు చెప్పారు. కొన్నేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్దం వల్ల సిరియా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని అబ్జాద్ పేర్కొన్నారు. అయితే తమ నూతన ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేసేందుకు అరబ్ దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు.