విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ, జనవరి 11: ఈ 2025 దీపావళికల్లా బంగారం పెట్టుబడులు గణనీయంగా 15-18 శాతం మేర రాబడుల్ని ఇస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సానుకూల ఆర్థిక అంశాలు, సురక్షిత మదు పు సాధనంగా బంగారానికి ఉన్న డిమాండ్‌తో ఈ విలువైన లోహం అప్‌ట్రెండ్ కొనసాగుతుందని వారన్నారు.
బంగారం, వెండి సంవత్ 2024లో భారీగా పెరిగాయని, ఈ లాభాలకంటే ప్రస్తుత 2025లో వీటి పెరుగుదల కాస్త తక్కువగా ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. 2024లో బంగారం ధర 30 శాతం పెరగ్గా, వెండి ధర 35 శాతం ఎగిసిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి 30 శాతం ఎగిసింది. దిగుమతి సుం కాల కోత కొనసాగితే దేశీయంగా బంగారం వచ్చే ఏడాదికాలంలో 15-18 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. అయితే సుంకాల్ని తిరిగి పెంచితే బంగారంపై రాబడులు తగ్గవచ్చని అంచనా వేశారు.
అంత ర్జాతీయ వడ్డీ రేట్ల విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంక్‌ల కొనుగోళ్లు, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఇన్వెస్టర్ల పెట్టుబడులతో సంవత్ 2024లో బంగారం, వెండి లోహాలకు గట్టి డిమాండ్ నెలకొన్నదని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా సరళ ద్రవ్య విధానాలు కొనసా గడంతో బంగారం, చైనా ఆర్థిక వ్యవస్థ రికవరీ కావడం, సోలార్, ఎలక్ట్రానిక్స్ పరిశ్ర మల డిమాండ్‌తో వెండి సంవత్ 2025లో కూడా అప్‌ట్రెండ్ కొనసాగిస్తాయని అంచ నా వేశారు.