calender_icon.png 22 January, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజరేషన్లు ఇవాలి

07-12-2024 02:35:56 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్

ఆదిలాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజరేషన్లు ఇవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీసీ సంఘాల నేతలు కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశరరావును ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బీసీ సంఘం నాయకులతో పాయల్ శంకర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ర్టంలో అత్యధికంగా ఉన్న బీసీలకు గత ప్రభుతం రిజరేషన్లు తగ్గించి ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరారు.