calender_icon.png 6 February, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి

06-02-2025 12:00:00 AM

ధనుంజయ నాయుడు డిమాండ్ 

హుజూర్ నగర్,ఫిబ్రవరి 5: చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

బుధవారం ఆయన హుజూర్నగర్ ఆర్డిఓ కార్యాలయం ముందు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బీసీలకు 50 శాంతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు పరచాలని, అలాగే ఎంతో కాలంగా బీసీలు ప్రధానంగాడిమాండ్

చేస్తున్నట్లుగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, రెండు లక్షల కోటతో బీసీ సంక్షేమ అభివృద్ధి కొరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, కందుల వెంకటేశ్వర్లు, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు దొంతగాని సత్యనారాయణ,గోపన బోయిన వెంకటేశ్వర్లు, జక్కుల రమేష్,జక్కుల అంజయ్య, కర్నే శ్రీనివాస్, జక్కుల రమణ పాల్గొన్నారు