calender_icon.png 21 January, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

21-01-2025 12:40:07 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, జనవరి 20: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఓబీసీ జాతీయ సెమినార్‌లను జరపాలనే డిమాండ్‌తో కాచిగూడలోని ఓ హోటల్‌లో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6, 7 తేదీల్లో  నిర్వహించనున్న ఛలోడిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

బీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేశ్ యాదవ్, నాయకులు ర్యాగ రమేశ్, రంగు విక్రమ్, టీ నందగోపాల్, గొరిగె మల్లేశ్ యాదవ్, వేముల రామకృష్ణ, మోడీ రాందేవ్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సుగుణ పాల్గొన్నారు.