calender_icon.png 31 January, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

31-01-2025 02:03:18 AM

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 

ముషీరాబాద్, జనవరి 30 : (విజయక్రాంతి): బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలోని అభినందన్ హోటల్‌లో..

బీసీల సమ  పరిష్కారమే లక్ష్యంగా ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో నిర్వహించనున్న ఓబీసీ జాతీయ సదస్సులకు సంబంధించి ఛలోఢిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆయన పలు బీసీ సంఘాల ప్రతిని  కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నాయని ఆరోపించారు.

జాతీ  సదస్సులకు ఓబీసీలంతా అధిక సం  హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సం  జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, ప్రధాన కార్యదర్శి సుగుణపతి, నాయకులు వెంకటేశ్, రామకృష్ణ, సుధాకర్, రఘుపతి, అనం  రాజేందర్, బాలయ్య పాల్గొన్నారు.