calender_icon.png 2 April, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

30-03-2025 12:00:00 AM

  1. రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు
  2. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ 
  3. రాజారామ్ యాదవ్ ప్రకటన

ముషీరాబాద్, మార్చి 29: (విజయక్రాంతి):  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సీఎం రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాద వ్, బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

శనివారం హైదరాబాద్ సెంటర్ కోర్టు హోటల్‌లో రాజారామ్ యాదవ్ అధ్యక్షతన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తూతూ మం త్రంగా కులగణన జరిపి కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయకుండా తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలనడం అనటం మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆర్ కృష్ణయ్య విమర్శించారు.

42 శాతం రిజర్వేషన్లు అమ లు కోసం బీసీ సంఘాలు, కుల సంఘాలు పార్టీలకతీతంగా పోరాటం చేయాలని మాజీ స్పీకర్  మధుసూదనాచారి సూచించారు. కాంగ్రెస్ చరిత్ర అంతా మోసపూరిత చరిత్రని బహుజన తత్వవేత్త నారగోని విమ ర్శించారు. రాష్ట్రంలో కులగణన చేయడం సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ఆరోపించారు.

కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, ఓదెల మాజీ జెడ్పిటిసి గంట రాములు, సీనియర్ జర్నలిస్టు రమణ కుమార్, బీసీ జర్నలిస్టుల పోరం నాయకుడు మేకల కృష్ణ, లోడంగి గోవర్ధన్ యాదవ్, ఎంబీసీ కులాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, బీదాస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.