calender_icon.png 6 February, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

06-02-2025 12:00:00 AM

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాం తి): జనాభా ప్రకారం మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ కేటగిరీల్లో వివేక్ వెంకటస్వామి హస్తం ఉందని, ఖర్గే, కొప్పుల రాజు, భట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి లాబీయింగ్‌కు రేవంత్‌రెడ్డి తలొగ్గారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్ర భుత్వం ఏబీసీ రిజర్వేషన్లు పెట్టిందన్నారు. ఏ కమిషన్ అయినా మాదిగలకు అన్యాయం జరిగినట్టు చెప్పిందని, తాజాగా షమీమ్ అక్తర్ కమిషన్ అదే రిపోర్ట్ ఇచ్చిందన్నారు.