22-12-2024 01:13:29 AM
* మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే డెడికేటెడ్ కమిషన్ వేశామని.. భవిష్యత్‌లో రిజర్వేషన్ల అమలు ఇబ్బంది ఉండదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సామాజిక అంశాల విషయంలో రాజకీయ పార్టీలు సహకరించాలని, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా చర్య లు తీసుకుంటుందని.. భవిష్యత్‌లో అ లాంటి పరిస్థితి రాకుండా ఆక్రమణకు గురైన స్థలాల సమాచారాన్ని స్థానికులే అధికారులకు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీ సభ్యులు పంచాయతీ రాజ్ బి ల్లుపై ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనం తరం శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందింది.