calender_icon.png 19 January, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీపీ మండల్ వల్లే 27 శాతం రిజర్వేషన్లు

25-08-2024 05:30:22 PM

సూర్యాపేట టౌన్, ఆగస్టు25 (విజయక్రాంతి): బీపీ మండల్ వల్లనే బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు లభించిందని డాక్టర్ వూర రామూర్తి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో గల మహర్షి డిగ్రీ కళాశాలలో జన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు అండగా బీపీ మండల్ ఉండి, వారి ఉద్యమ స్ఫూర్తితో 1993 నుండి బీసీలకు 27% విద్యా ఉద్యోగుల్లో రిజర్వేషన్లు పొందుతున్నట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వము సమగ్ర కులగణన జరిపి చట్టసభలలో వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.