26-03-2025 01:47:42 AM
హైదరాబాద్, మార్చి 25: ఆస్తిపన్ను చెల్లించని వారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పన్నుపై వడ్డీలో 90శాతం రాయితీ ఇస్తామని, యజమానులు అసలుతో పాటు కేవలం 10 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. ఈమేరకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీ ఎస్) స్కీంను అమలు చేస్తున్నట్లు మం గళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్కీంను సద్వినియోగం చేసుకునేందుకు ఈ నెల 31 ఆఖరు తేదీ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ స్కీం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో అమలు ఉంది. జీహెచ్‌ఎంసీలో సత్ఫలితాలు వస్తుండడంతో స్కీంను సర్కార్ రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణయించింది.