calender_icon.png 8 January, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవో పరీక్షకు 37 శాతం మంది హాజరు

08-01-2025 12:10:18 AM

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖలో ని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈవో-సూపర్ వైజర్) గ్రేడ్-1 పోస్టులకు పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. 2022 ఆగస్టు 27న 181 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిం చారు. మొత్తం 26,751 మంది దరఖాస్తు చేసుకోగా, మంగళవారం నిర్వహిం చిన పేపర్-1 పరీక్షకు 5,035 (37.65 శాతం), పేపర్-2కు 5,032 (37.63 శాతం) మంది హాజరయ్యారు. ఈ నెల 6న జరిగిన పేపర్-1కు 5,472 (40.90 శాతం), పేపర్-2కు 5,459 (40.80 శాతం) మంది హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.