calender_icon.png 11 October, 2024 | 9:58 AM

98 శాతం 2 వేల నోట్లు తిరిగి వచ్చాయ్: ఆర్బీఐ

02-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: రద్దుచేసిన రూ.2,000 నోట్లలో 98 శాతం తిరిగి వచ్చాయని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. 2023 మే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 వేల నోట్లు సర్క్యులేషన్‌లో ఉండగా, ఇప్పుడు రూ.7,117 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల దగ్గర ఉన్నాయని ఆర్బీఐ మంగళవారం వెల్లడించింది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. రూ.2,000 నోట్లకు లీగల్ టెండర్ కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాల యాల్లో నేరుగా మార్చుకోవచ్చని, లేదా పోస్టు ద్వారా పంపి, బ్యాంక్ ఖాతాల్లో జమ కోరవచ్చని రిజర్వ్ బ్యాంక్ వివరించింది.